వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

Chaganti
పాము పేరు వింటేనే చెమటలు పడతాయి. అలాంటిది మీ పడకగది నుంచి అకస్మాత్తుగా పాము బుసలు కొడుతున్న శబ్దాలు రావడం మొదలైతే మీరైతే ఏమి చేస్తారో ఊహించుకోండి. అవును, సింగపూర్‌లో ఒక మహిళకు అలాంటిదే జరిగింది. పడక గదిలో కోబ్రా  బుసలు కొడుతున్న శబ్దం విని, ఆమె చాలా భయపడింది, వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసింది. అయితే రెస్క్యూ టీమ్ పామును పట్టుకోవడానికి చేరుకున్నప్పుడు,  వేరే విషయం అని తేలింది. ఎన్‌పిఆర్‌ఆర్‌జి నివేదిక ప్రకారం, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని నాగుపాము కోసం వెతకడం మొదలుపెట్టినప్పుడు, ఈ శబ్దం పాము బుసలకి సంబంధించినది కాదని గుర్తించారు. నిజానికి, ఆ మహిళ పాము బుసలని తప్పుగా భావించిన శబ్దం ఆమె టూత్ బ్రష్ ధ్వని అట. ఆ మహిళకు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉంది, అందులో నీరు పోయినందున దాని నుండి పాము బుసల శబ్దం వచ్చింది. బ్రష్‌ను ఆన్ మరియు ఆఫ్ చూసిన తర్వాత, అది విషపూరిత కోబ్రా పాము శబ్దం కాదని, టూత్ బ్రష్ శబ్దం అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: