కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్ ఈటెల కుటుంబం పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఈటెల పై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే కెసిఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని... భవిష్యత్తులో బిజెపి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హుజురాబాద్ ఎన్నికల వేళ కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.