యోగీ రాజ్యం ఇక మారదా?
ఈ కేసు బండా జిల్లాలోని తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆగస్టు 14 సాయంత్రం జరిగినట్లు పోలీసు అధికారి ప్రదీప్ కుమార్ యాదవ్ శనివారం తెలిపారు. బాలిక తల్లి ఆగస్టు 19న 5 మంది నిందితులపై ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ ఆరోపణలతో 13 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు మైనర్ అబ్బాయిలను ఈ రోజు అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సంఘటన జరిగినప్పుడు బాధితురాలు బాత్రూం కోసం యమునా నది ఒడ్డుకు వెళ్లిందని తెలుస్తోంది.