ఏపీ రాజధానిపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటూ గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు..రేపు మరో ప్రాంతం కావచ్చని గౌతం రెడ్డి అన్నారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రెటరియేట్..అదే రాజధానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని గౌతంరెడ్డి అన్నారు.
ఎస్వీయూనివర్సిటీలో చిత్తూరుజిల్లా సమీక్ష కమిటీ సమావేశం అనంతరం మంత్రులు పెద్గిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మరియు గౌతంరెడ్డిమీడియాతో మాట్లాడారు. చిత్తూరుజిల్లాలో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయంటూ గౌతమ్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు. గ్రామసచిలయాలు, రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేసి చర్యలు చేపట్టామని తెలిపారు. ఏపీకి కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని...యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.