ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముకం పట్టడంతో పాఠశాలలను ప్రారంభించిన సంగతిత తెలిసిందే. కాగా స్కూల్లను ప్రారంభించిన అనంతరం మళ్లీ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 10 రోజుల్లో ముగ్గురు టీచర్లు , నలుగురు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో మొత్తం 4గురు 10వ తరగతి విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. వారం రోజుల క్రితం అదే హైస్కూల్ లో టీచర్ కు కరోనా పాజిటివ్ రాగా విద్యార్ధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేడు 36 మంది విద్యార్ధులకు అధికారులు కరోనా టెస్టులు చేయించగా పదమూడు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా మరో నలుగురు టీచర్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.