రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే విద్యాసంస్థల రి ఓపెన్ పై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురుకుల పాఠశాలలు, వసతీ గృహాలు మినహా రేపటి నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని...తల్లిదండ్రులను విద్యార్థుల హాజరుపై పాఠశాలల యాజమాన్యాలు వత్తిడి చేయకూడదని సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
తరగతులను ప్రత్యక్ష పద్ధతిలో గాని... ఆన్లైన్ ద్వారా గానీ నిర్వహించే అవకాశం స్కూల్ యాజమాన్యాలకే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల నుండి ఎలాంటి సమ్మతి పత్రాలను కోరవద్దని స్కూల్ మేనేజ్ మెంట్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పాఠశాలల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.