మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సొంత పార్టీకి చెందిన మహిళా నేత పద్మా రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను, తన కుమారుడిని చంపుతానని ఫోన్ లో ఎమ్మెల్యే బెదిరించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య తో తనకు ప్రాణహాని ఉందని పద్మా రెడ్డి అనే మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
బెల్లం పెల్లి మున్సిపాలిటీ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటి పై తన కుమారుడు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశాడని పద్మా రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనపై తన కుమారుడిపై ఎమ్మెల్యే కక్షతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు చేసింది. ఆ కక్షతోనే ఎమ్మెల్యే చిన్నయ్య తమను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఇక సొంత పార్టీకి చెందిన మహిళా నేత ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నాయకులు సైతం ఈ వ్యవహారం పై విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.