రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ముంబైలో సైలెంట్ గా జరుగుతుండటంతో ఎలాంటి అప్ డేట్ లేక ఫ్యాన్స్ అంతా ఇంత కాలం సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాపై రేపు సాయంత్రం నాలుగు గంటలకు అప్డేట్ ఉంటుందని పూరి జగన్నాథ్ ప్రకటించారు.
దాంతో సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఉంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా... పూరీ వెండి తెరకు పరిచయం చేసిన అనన్య పాండే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన చార్మి తో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.