సినిమా నటి ప్రియా గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో సైడ్ యాక్టర్ గా నటించి మంచి నటిగా తెలుగు ప్రేక్షకులని మెప్పించింది.తల్లిగా, అక్కగా,చెల్లిగా ఎన్నో సినిమాలు చేసిన ప్రియా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది. అక్కినేని నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ప్రియా నటించింది.ప్రతి సినిమాలలో కూడా తన నటనతో పక్కింటి తెలుగు ఆడపడచు లాగా ఎంత గానో ఆకట్టుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ప్రియా ఇక గత కొంతకాలం నుంచి సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రియా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన పోస్ట్ లతో ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయర్స్ నే సంపాదించుకుంది ప్రియా. తెలుగులో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపెంట్ గా 7 వ హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా. ఇక చూడాలి ప్రియా తన ఆటతో ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో.