మరో బీజేపీ సీఎం రాజీనామా.. !

గుజరాత్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా గుజరాత్ సీఎం పదవికి రాజీనామా విజయ్ రూపాని చేయడం సంచలనం గా మారింది. గుజరాత్ గవర్నర్ కు రూపాని తన రాజీనామా లేఖను పంపించారు. వచ్చే ఏదాది లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రుపాని రాజీనామా చేయడం సంచలనం గా మారింది. విజయ్ రూపాని 2016వ సంవత్సరం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ పటేల్ రాజీనామా తరవాత రూపానీ సీఎం గా బాధ్యతలు స్వీకరించగా ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేశారు.

రాజీనామా అనంతరం మీడియాతో రూపాని మాట్లాడుతూ...బిజెపిలో నాయకత్వ మార్పు సాధారణం అని అన్నారు. రాజీనామా చేసిన తరవాత కూడా అధ్యక్షుడి నాయకత్వం లో సేవలు అందిస్తా అని రూపాని తెలిపారు. ఇక ఇప్పటివరకు మొత్తం ముగ్గురు బిజెపి సీఎంలు రాజీనామా చేయగా... నాలుగో బీజేపీ ముఖ్యమంత్రిగా విజయ్ రూపాని ఉన్నారు. ఇటీవలే  కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా త్రివేంద్ర సింగ్ రావత్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: