టీటీడీ ఈవో మరో సంచలన నిర్నయం తీసుకున్నారు. ఇప్పటికే సంప్రదాయ భోజనం... కల్యాణ మండపాల లీజు అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి హౌస్ బిల్డింగ్ లోన్ లో అవకతవకలకు పాల్పడ్డారని 49 మందికి నోటీసులు ఇచ్చారు .
అయితే ఇంత మంది ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం టీటీడీలో ఇదే మొదటిసారి కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగులు ఉండటం ఆసక్తి రేపుతోంది. అంతే కాకుండా మరి కొంతమంది ఉద్యోగులకు కూడా టీటీడీ నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే టీటీడీ ఆర్జిత టికెట్ల స్కాం లో టీటీడీ ఏడుగురిని సస్పెండ్ చేసింది .