2006 రిపీట్ చేస్తా: ఈటెల కాన్ఫిడెన్స్

జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ అని ఆయన కామెంట్స్ చేసారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా జరపాలి అని ఆయన డిమాండ్ చేసారు. కెసిఆర్ ఎవరికి భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదో చెప్పాలి అని ఆయన కోరారు. దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు హుజురాబాద్ లో చెల్లవు అని స్పష్టం చేసారు.
 
చాకలి  ఐలమ్మ సిఎం కాదు.. కానీ ప్రజలకోసం ప్రాణం అర్పించారు అన్నారు ఆయన. చరిత్ర హీనులను, చరిత్ర వీరులను ఇద్దరినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. హిట్లర్ చరిత్ర హీనుడు అయితే.. మన శ్రీకాంత చారి చరిత్ర వీరుడు అన్నారు. హుజురాబాద్ నివురు గప్పిన నిప్పులా ఉంది అని 2006 ఉప ఎన్నిక రిపీట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: