కడపలో సైలెంట్ షాక్ ఇచ్చిన టీడీపీ...?
కమలాపురం మండలం లో టిడిపి అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. అధిష్టానం వద్దని చెప్పినా సరే పోటీకి దిగిన అభ్యర్ధులు... విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. కమలాపురం మండలం పెద్దచెప్పలి టీడిపి ఎంపిటీసి స్ధానం లో... రెండవ రౌండుకే 1000 ఓట్లకు గాను 500 పై చిలుకు ఆధిక్యం లో టిడిపి ఉండటం ఆశ్చర్యపరిచింది. టిడిపి రాష్ట్రకార్యదర్శి సాయినాధ్ శర్మ ఆధ్వర్యంలో టిడిపి కార్యక ర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.