బెజవాడ కేంద్రం గా అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా జరుగుతుండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే బెజవాడ లో కార్యాలయం ఏర్పాటు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లావాదేవీలు, వ్యహారాలు అన్ని కూడా చెన్నై కేంద్రం నుండి గత పది ఏళ్ళు గా నిర్వహణ జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో కేంద్రం లో ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి సుధాకర్ అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నారు.
నిధితుడు సుధాకర్ స్వస్థలం కాకినాడ కాగా అతడి భార్య ది విజయవాడ లోని సత్యనారాయణ పురం అని విచారణలో తేలింది. కాగా భార్య ఇంటి లోనే ఆషి ట్రేడింగ్ కంపెనీని సుధాకర్ నెలకొల్పాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుధాకర్ కు సంబంధించిన వివరాలతో పాటు అతని భార్య తాలూకా వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.