మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల నగరంలో బ్రిడ్జిపై వెళుతున్న క్రమంలో బైక్ పై పిడుగు పడింది. దాంతో భార్య భర్తలు అక్కడే మృతి చెందారు. బైక్ పై ఉన్న చిన్నారి కూడా తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. కాగా చిన్నారి కూడా చికిత్స పొందుతూ గంటల వ్యవదిలోనే మరణించాడు. మృతులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుడు వెంకటేష్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు.
ఈ ఘటనలో బైక్ పై ఉన్న వెంకటేష్ భార్య మౌనిక మరియు కుమారుడు ఉన్నారు. తన కుమారుడు కియాన్ అనారోగ్యానికి గురవ్వడంతో వెంకటేష్ భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఇక మృతదేహాలను ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి వద్ద ఉంచారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ హోలీ కేరీ సందర్శించారు.