అలెర్ట్ అయిన బెజవాడ పోలీసులు...!

విజయవాడ లో దసరా కో ఆర్డినేషన్ సమావేశంలో నగర కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ... గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేసారు. మూల నక్షత్రం రోజు గుడి ప్రారంభ, ముగింపు టైమింగ్స్ ను కూడా భక్తులకు ముందే తెలియజేస్తే బాగుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

సీసీ టివి లను కూడా 24 గంటలూ పనిచేసేటట్టు చూసుకోవాలి, సీసీ టివిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక టీమ్ ను నియమించాలి అని ఆయన ఆదేశించారు. విఐపి ప్రోటోకాల్ కి కూడా ప్రత్యేకంగా ఒక టీమ్ పెట్టాలి అని సూచించారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి, 24 గంటలూ సర్వీస్ అందించేలా చూడాలి అని కోరారు. మళ్ళీ ఒకసారి కొండపై పూర్తిగా పర్యవేక్షణ చేయాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: