ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది, తాజాగా ఈ విషయం మీద విచారణ జరిగింది, ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. నరేగా పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని చీఫ్ సెక్రటరీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ను హైకోర్టు రికార్డు చేసింది, అయితే ఏపీలో చేపట్టిన నరేగా పనులకు మొత్తం డబ్బులు చెల్లించామని కేంద్రం పేర్కొనడం సంచలనంగా మారింది, విచారణ జరుగుతున్నట్టు తమకు నివేదిక లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న క్రమంలో ఈనెల 29వ తేదీన తీర్పు ఇస్తామని ఈ కేసును వాయిదా వేసింది హైకోర్టు, ఇక 29వ తేదీన తుది ఉత్తర్వులు ఉంటాయని జస్టిస్ బట్టు దేవానంద్ స్పష్టం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: