ఇక అన్నీ సుప్రీం కోర్టుకే

ఇక అన్నీ సుప్రీం కోర్టుకే
రాజ్యాంగ సవరణలు, మౌలిక స్వరూపాలకు, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా దాఖలవుతున్న కెేసులన్నింటినీ సుప్రీం కోర్టు కు నివేదించాలని భారత అత్యున్నత న్యాయస్థానం  అదేశించింది. ఆర్థికంగా వెనుకబడి వర్గాలు ( ఈ.డబ్ల్యు.ఎస్) రిజర్వేషన్లు ఖరారు చేస్తు  పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇస్తుండటం, వాటి పై  హైకోర్టుల్లో వ్యాజ్యాలు జరుగుతుండటం తెలిసిందే. హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ మరలా సుప్రీం కోర్టు తలుపుతట్టడం జరుగుతోంది. దీంతో కాలం వృధా అవుతోంది. ఈ.డబ్ల్యు.ఎస్ కు సంబంధించి పలు  హైకోర్టులలో  కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీం కోర్టులోనూ ఇదే తరహా  కేసులున్నాయి. దీంతో సుప్రీం కోర్టు ఈ.డబ్ల్యు.ఎస్ కేసులకు సంబంధించిన దావా లన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం పరిశీలిస్తుందని ఉత్తర్వులు ఇచ్చింది.
మద్రాసు హై కోర్టు ఈ.డబ్ల్యు.ఎస్ విషయలో చేసిన రెండు వ్యాఖ్యలును కూడా  సుప్రీం కోర్టు కొట్టి వేసింది.  నీట్ పరీక్షలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదంటా  తమిళవాడులోని డి.ఎం.కె పార్టీ కేంద్ర ప్రభుతం పై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ  కేసు విచారణ సందర్భంలో హై కోర్టు కొన్ని వ్యాఖ్యులు చేసింది.. అదేవిధంగా వైద్య కళాశాలల్లోో ఈ.డబ్ల్యు.ఎస్
అభ్యర్థులకు రిజర్వేషన్లు సరిగా అమలు చేయడం లేదంటూ  దాఖలైన వ్యాజ్యంలోను హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
కేరళ హైకోర్టులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ లు కల్పించడాాన్ని వ్యతిరేకిస్తూ దావా దాఖలైంది. ఈ కేసుపై ఎలాంటి విచారణ జరపవద్దని అత్యున్నత న్యాయస్థానం ,స్టే ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కోర్టులో ఇలాంటి వాజ్యమే ఉన్నదని పేర్కొంది. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం విచారణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: