గెహ్లట్ కు మరో శరాఘాతం

గెహ్లట్ కు  మరో శరాఘాతం
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ పై ముప్పెట దాడి జరుగుతోందా ? ముఖ్యమంత్రి పదవిని చెపట్టింది మొదలు, నిత్యం ఏదో ఒక ఇరుకు ఇబ్బందులతోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొందా ? తాజాగా వరుస  వెంబడి  జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి. పంజాబ్ లో ముఖ్య మంత్రి ని మార్చడం తో వేగంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన దృష్టి సారించారు. తన వర్గాన్ని చేజారిపోనీకుండా జాగ్రత్త  పడ్డారు. అదే సమయంలో స్వంత పార్టీనే ఉన్న అసమ్మతి నేత సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో సమావేశం కావడం పై కూడా  రాజస్థాన్ ముఖ్యమంత్రి పెద్దగా స్పందించ లేదు. తాజాగా  ఆయనకు  జాతీయ బాలల హక్కుల సంరక్షణ మండలి  (ఎన్.సి.పి.సి.ఆర్) నుంచి తాకీదు అందింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకుంటన్న నిర్ణయాలు సరిగా లేవని ఎన్.సి.పి.సి.ఆర్ వ్యాఖ్యానించింది.  సత్వరం సమాధానం చెప్పాలంటూ  గెహ్లట్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో  ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుని కూర్చున్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల 2009 నాటి వైవాహిక చట్టంలో మార్పులు  చేస్తూ బిల్లును తీసుకువచ్చింది.    వివాహానికి 30 రోజుల ముందు  రిజిస్ట్రేషన్ తప్పని సరి. ఇది చట్టం చెబుతున్న విషయమే అయినా , ఇందులొ రాజస్థాన్ ప్రభుత్వం స్వల్పమార్పులు చేసింది.  మైనర్టీ తీరని పిల్లల వివాహం విషయంలో  మార్పులు చేసిందిద. స్థానికంగా నివాసం ఉండే తల్లితండ్రులు స్వయంగా వచ్చి ముప్పై రోజుల ముందు  రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పిల్లలు  వివాహహ విషయం పై పేర్లు నమోదు చేసుకోవచ్చు.
 ఈ బిల్లు పై ఎన్.సి.పి.సి.ఆర్ తాగా తన అభ్యంతరాన్ని లేఖ మూలంగా తెలిపింది. ఈ బిల్లుని పరిశీలించాలని , వెనక్కి తీసుకోవాలని సూచించింది. భారత దేశంలో వివాహం చేసుకునేందుకు పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలని చట్టం చెబుతోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా రాజస్థాన్ ప్రభుత్వం బిల్లు తీసుకు రావడాన్ని ఎన్.సి.పి.సి.ఆర్ తప్పుపట్టింది. అసలే ఆటుపోట్లతో కొట్టుమిట్టాడుతున్నఅశోక్ గెహ్లాట్ ఇది మరో శరాఘాతం లా తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: