బూస్ట‌ర్‌డోస్ తీసుకున్న జోబైడెన్‌?

Garikapati Rajesh

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూస్టర్ డోసు వేయించుకున్నారు. అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే బైడెన్ మొదటి రెండు డోసులు తీసుకున్నారు.  తొలి రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకపోవడంతో మూడో డోసు తీసుకున్నట్లు శ్వేతసౌధం అధికారులు ప్ర‌క‌టించారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారం రోజుల కింద ఫైజర్ అభివృద్ధి చేసిన బూస్టర్ డోసును అత్యవసర వినియోగానికి ఉప‌యోగించ‌వ‌చ్చంటూ ఆమోదించింది. 65 సంవ‌త్స‌రాల‌కు పైబడిన వారు ఈ బూస్టర్ డోసు వేయించుకోవచ్చు.  అర్హత ఉన్నవారు మూడో డోసు తీసుకోవడం ముఖ్యమని బైడెన్ అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బూస్ట‌ర్ డోస్ ప్రాముఖ్యంపై స‌మాలోచ‌న‌లు జ‌రుగుతున్నాయి. దీనిపై ఇంకా ఒక‌నిర్ణ‌యానికి రాకుండానే అమెరికా లాంటి దేశాలు మాత్రం త‌మ పౌరుల‌కు బూస్ట‌ర్ డోస్ ఇవ్వ‌డానికి ఆలోచిస్తున్నాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇంకా టీకాలంద‌ని పేద దేశాల‌కు ముందు పంపించాల‌ని కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: