తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు . ఎర్రబెల్లికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు . అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఎర్రబెల్లి వేద ఆశీర్వచనం తీసుకున్నారు . అమ్మ వారి చిత్రపటాన్ని... లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు . ఈ సంధర్బంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ....విజయవాడ వస్తే దుర్గమ్మను దర్శించుకుంటాని ...
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు . అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ... ఆర్థికంగా రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని అమ్మని వేడుకున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు . కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెలుతోందని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు .