హైకోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్?
తెలంగాణ హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. ఇంతకుముందు వీరిద్దరి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయస్థానం విధించే షరతులను ఉల్లంఘించారని, వారి బెయిల్ రద్దుచేయాలని రాఘురామ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను నిబంధనలను ఉల్లంఘించలేదని, పిటిషనర్ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశారని జగన్, విజయసాయిరెడ్డి న్యాయవాదులు వాదనలు వినిపించారు.