తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశంలో పంట, రుణాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కౌలు రైతుల పట్ల మాకు సానుకూలత ఉంది. పంట నష్టం ఎప్పడు జరుగుతుందంటే భారీ వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు, పురుగు పీడ్చినప్పుడు మాత్రమే అని చెప్పారు. ప్రకృతి పరంగా భారీ వర్షం వచ్చినప్పుడు కేంద్రం పట్టించుకోవడం లేదు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా.. మరోబీమా.. అంతా బోగస్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏదేశమైన ఆహార ధాన్యాలు బఫర్ స్టాక్‌గా పెట్టుకుంటుంది. అతివృష్టి, అనావృష్టి వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవచ్చు. కేంద్రం పంటలను తీసుకోవడం లేదు. అదేవిధంగా దేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో ముంపు తీవ్రత ఎక్కువగా వరదలు సంభవిస్తాయని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రంలో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్ర బృందం పర్యటించలేదు. కేంద్రప్రభుత్వం పంటబీమాను తీసేసింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.