తెలంగాణా
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా
అక్టోబర్ 14 నుండి అమలు లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణా సిఎం
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
నీటి వివాదాల విషయంలో మరోసారి
తెలంగాణ వైఖరిని
అసెంబ్లీ లో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్... మన ప్రాజెక్టు ల పై కేంద్రం పెత్తనం తగదు అని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు.
నీటి వివాదాల విషయం లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేనిపోని రాద్దాంతం చేస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.
గెజిట్ నోటిఫికేషన్ ను కొద్దీ రోజులు వాయిదా వేయాలని నాలుగు సార్లు కేంద్రాన్ని కోరాను అని ప్రస్తావించారు ఆయన. వ్యక్తిగతంగా కలిసి
ఢిల్లీ పెద్దలకు వివరించాను అని పేర్కొన్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అన్నారు. అవసరైతే ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను అని సిఎం
కేసీఆర్ స్పష్టం చేసారు.