ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి..!

కొత్త కారు కొనుక్కుని ఎంతో సంతోషం తో పూజకు వెళుతుంటే వారి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. మార్గ మధ్య లోనే ప్రమాదం జరగటం తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలం నారపరెడ్డి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారపరెడ్డి పల్లి వద్ద వేగంగా కారు స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.


యాక్సిడెంట్ జరిగిన కారు కొత్త కారుగా తెలుస్తోంది. నూతనంగా కొనుగోలు చేసిన కారుకు మాలకొండ ఆలయంలో పూజలు చేయించు కునేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్కా తమ్ముళ్లు గా గుర్తించారు. 
గాయపడిన క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబం లో నలుగురు మృతి చెందడం తో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: