ప్రభుత్వం చేసిన అప్పుకు ఏడాదికి 42వేల కోట్ల వడ్డీ : మాజీ ఎంపీ

తూర్పుగోదావరి రాజమండ్లి లో 
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందంటు మండి పడ్డారు. ఎంతో మంది ఆర్థిక సలహాదారులు గా ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయమైన స్థితిలో ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. 
పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి
4068 కోట్లకు సంబంధించి కొర్రీలు వేశారంటు మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 
6 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 7 శాతం చొప్పున 42 వేల కోట్లు ప్రతీ ఏడాది వడ్డీ చెల్లించాలని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు దివాళా తీసే పరిస్థితి రాదని... కానీ ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేలా ఉందంటూ ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: