మా ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. గొడవలు జరిగితే పోలింగ్ రద్దు చేస్తానని పోలింగ్ అధికారి అంటున్నారు. రిగ్గింగ్ జరగలేదు..దీనిపై ఎటువంటి ఆందోళనలకు ఆస్కారమే లేదని నరేశ్ కూడా అంటున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున ఓ దొంగ ఓటు నమోదైంది అని ఓ ఆరోపణ వినిపిస్తోంది. అదేవిధంగా ఎటువంటి గందరగోళానికి తావివ్వకుండా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సహకరిస్తున్నామని మంచు విష్ణు అంటున్నారు. మరోవైపు బ్రహ్మానందం రాకతో ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటిదాకా ముప్పయి శాతం పోలింగ్ పూర్తయిందని అంటున్నారు. సభ్యుల మధ్య గొడవలు హద్దులు దాటితే హైకోర్టుకు విషయాన్ని నివేదించి,ఫలితాలను రిజర్వులో ఉంచాల్సి వస్తుందని కూడా పోలింగ్ అధికారి అంటున్నారు. ఎన్నడూ లేని ఓ కురు క్షేత్ర వాతావరణం లోపల నెలకొని ఉందని సుమన్ లాంటి సీనియర్ నటులతో సహా ఇంకొందరు అంటున్నారు.