గత ఎన్నికలతో పోలిస్తే మా ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ మొదలైన క్షణం నుండి ఒక్కొక్కరుగా ఓటు వేసేందుకు విచ్చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మా ఎన్నికల్లో 430 ఓట్లు పోలింగ్ జరగగా మొత్తం 883 ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మా ఎన్నికలు జరుగుతున్న వేళ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయాన్నే వచ్చి తన ఓటును నమోదు చేసుకున్నారు. అనంతరం చిరంజీవి,
రామ్ చరణ్, నాగబాబు వచ్చి తమ ఓట్లను వేసారు.
ఇక తాజాగా
బండ్ల గణేష్ కూడా వచ్చి తన ఓటు వేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ లో ఎటువంటి గొడవలు జరగడం లేదని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుందని బండ్ల అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని
మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా నేను ఓటు వేసిన వారే గెలుస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఇద్దరిలో ఒకరు గెలుస్తారని బడ్ల అన్నారు. కానీ తన సపోర్ట్ ఎవరికో మాత్రం బండ్ల బయటకు చెప్పలేదు.