మా పోరులో చెల్ల‌ని ఓట్లు ?

RATNA KISHORE

మా ఎన్నిక‌ల‌కు సంబంధించి యాభై చెల్ల‌ని ఓట్లు ప‌డ్డాయ‌ని తేలింది. మొత్తం 883 మందికి ఓటు హ‌క్కు ఉండ‌గా, 605 ఓట్లు పోల య్యాయి. అర‌వై పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు న‌మోదు అయ్యాయి. దీంతో ఫ‌లితాల‌పై  ఎటువంటి ప్ర‌భావం చూపనున్నాయ‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు పోస్ట‌ల్ బ్యాలెట్ లో విష్ణుకు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. తొలుత 18 మంది ఎక్జిక్యూటివ్ మెంబ‌ర్ల‌కు సంబంధించి ఫ‌లితం వెల్ల‌డి కానుంది. ఆ త‌రువాత వైస్ ప్రెసిడెంట్ ఎవ‌ర‌న్న‌ది తేల‌నుంది. మొత్తం ఆరు టేబుళ్ల‌పై కౌంటింగ్ సాగుతోంది. చెల్ల‌ని ఓట్ల‌ను నోటాగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు అంటున్నారు. నేరు ఓట్ల‌లో ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కు లీడ్ వ‌స్తుంద‌ని సమాచారం. ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది జీవితాల‌ను ప్ర‌భావితం చేసే ఎన్నిక‌లు కావ‌డంతో అటు ఆంధ్రా ఇటు తెలంగాణ‌లోనూ ఆస‌క్తి పెరుగుతోంది. కొన్నింట బెట్టింగ్ లు కూడా జోరందుకున్నాయి. రాజ‌మండ్రి త‌దిత‌ర ప్రాంతాల‌లో బెట్టింగ్ లు న‌డుస్తున్నాయి. పోలింగ్ జ‌రిగిన ప్రాంతం ద‌గ్గ‌ర కొంద‌రు బెట్టింగ్ బంగార్రాజులు వ‌చ్చి, ఆరా తీసి వెళ్లార‌న్నది ఓ స‌మాచారం. ఏదేమైన‌ప్ప‌టికీ  మ‌రికొద్ది సేప‌ట్లో తొలి ఫ‌లితం వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: