మా ఎన్నికలు: మంచు విష్ణు ప్యానెల్‌లో మరో ఇద్దరు గెలుపు!

N.Hari
ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న మా ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడి మరింత ఊపందుకుంది. మంచు విష్ణు ప్యానెల్‌ నుంచి మరో ఇద్దరు గెలుపొందారు. శివ బాలాజీ, రఘు బాబు విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానెల్‌లో మొత్తం పది మంది ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇటు మంచు విష్ణు ప్యానెల్, అటు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లోని వారెవరూ కూడా తమతమ గెలుపు అవకాశాలపై ఆశలను అసలు వదులుకోవడం లేదు. మంచు విష్ణు ప్యానెల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నరేష్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి విక్టరీ సింబల్ చూపించి వెళ్లారు. విష్ణు ప్యానెల్‌లోని ఎక్కువ మంది ఈసీ మెంబర్ ఆధిక్యంలో ఉన్నట్లు నరేష్ సంకేతాలు ఇచ్చారు. దీంతో గెలుపుపై మంచు విష్ణు ప్యానెల్ చాలా ధీమాగా ఉందనడానికి నరేష్‌ విక్టరీ సింబల్‌ చూపించి వెళ్లిన దృశ్యమే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యితే ఈసీ మెంబర్లలో ఎవరెవరు గెలిచారు అనే విషయాన్ని ఇప్పటివరకు అధికారులు ధృవీకరించ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: