నిన్న మా ఎన్నికల సందర్భంగా ముంబై నుండి ఓటు వేసేందుకు జెనీలియా వచ్చిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు జెనీలియా మంచు విష్ణు కోసం ముంబై నుంచి వచ్చి ఓటు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఎలక్షన్లకు ముందు ప్రకాష్ రాజ్ కొంతమంది బయట ఉన్నారని జెనీలియా మరికొంత మంది నటీనటులు ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారా అని వ్యాఖ్యానించారు. దాంతో మంచు విష్ణు స్పెషల్ గా జెనీలియా ను రప్పించినట్టు కనిపిస్తోంది.
ఇక జెనీలియా వచ్చిన వెంటనే మంచు విష్ణు మా ఫ్రెండ్ వచ్చింది అంటూ బయటకు వెళ్లి పోలింగ్ బూత్ లోకి తీసుకువెళ్లారు. దాంతో అక్కడ ఉన్న వారంతా జెనీలియా ని చూసి షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మి ఆసక్తికర ఫోటోని షేర్ చేసింది. నిన్న ఇదే జరిగిందని నేను మంచు విష్ణుకు జెనీలియా భర్త రితేష్ తో దిగిన ఫోటో ను పంపించా అని దానికి రిప్లై ఇస్తూ మంచు విష్ణు జెనీలియా తో దిగిన ఫోటో పంపించాడని పేర్కొంది. ఎంత క్యూట్ గా ఉందో ఇది ఇది... అంటూ మంచు లక్ష్మి తను రితేష్ తో దిగిన ఫోటో మంచు విష్ణు జెనీలియా తో దిగిన ఫోటో కలిపి షేర్ చేసింది.