ఇది అందరి విజయం : మోహన్ బాబు

N ANJANEYULU
మా ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత మంచు విష్ణు తొలిసారిగా విలేక‌ర్ల  స‌మావేశం నిర్వ‌హించారు. ఈ  సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు మాట్లాడారు. భ‌గ‌వంతుని నిర్ణ‌యం కాలం నిర్ణ‌యిస్తుంది. మ‌న చేతుల్లో ఏమి ఉండ‌దు. దాదాపు నేను 17 ఏండ్ల క్రితం ఇదే అక్టోబ‌ర్ లో నేను ఏక‌గ్రీవంగా మా అధ్య‌క్షునిగా ఎన్నిక‌య్యాను. ఇప్పుడు అక్టోబ‌ర్‌లో నా కుమారుడు విష్ణు గెల‌వ‌డం సంతోషంగా ఉంది. కొంద‌రు రెచ్చ‌గొట్టాల‌ని చూశారు. సింహం ఎప్పుడు నాలుగు అడుగులు వెన‌క్కి వేసి.. ఆత‌రువాత ఒకేసారి విజృంభిస్తుంట‌ది.

వేదిక దొరికింద‌ని ఎవ‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌కూడ‌దు. అలా అని మౌనంగా ఉన్నాన‌ని అస‌మ‌ర్థుడు అనుకోవ‌ద్దు.  ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే మ‌న‌మే దిగ‌జారిపోతాం అని పేర్కొన్నారు. నిన్న‌టిది వేస్ట్‌.. ఈరోజు న్యూస్‌.. రేపు క్వ‌శ్చ‌న్‌పేప‌ర్ అని మోహ‌న్‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిల స‌హ‌కారంతో అభివృద్ధి సాధించాల‌ని కోరారు. మా అనేది ఒక కుటుంబం. అంద‌రిదీ ఒకే పార్టీ అని చెప్పుకొచ్చారు మోహ‌న్‌బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: