మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మొత్తం 925 మెంబర్స్ ఉండగా మొత్తం 883 ఓట్లు ఉన్నాయి. అందులో ఈ సారి 603 పోలింగ్ ఓట్లు పోల్ అయ్యాయి. వాటిలో 54 పోస్టల్ ఓటర్లు కాగా మిగతావి 655 పోలింగ్ పోల్ అయ్యాయి. ఇర అధ్యక్ష స్థానం లో పోటీచేసిన వారిలో ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు రాగా మంచు విష్ణు కు 383 వచ్చి విజయం సాధించాడు. అంతే కాకుండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థానంకు పోటీచేసిన బాబు మోహన్ కు 269 ఓట్లు రాగా ఆయన పై శ్రీకాంత్ 375 ఓట్లతో విజయం సాధించాడు. ఇక వైస్ ప్రెసిడెంట్ 2 స్థానాలకు మాదాల రవి 376 రాగా బెనర్జీ 298 ఓట్లతో గెలిచారు.
ట్రెజరర్ స్థానంలో నాగినీడు కు 293 ఓట్లు రాగా ఆయనపై శివ బాలాజీ 360 ఓట్లతో గెలిచారు. జాయింట్ సెక్రటరీ 2 స్థానాలలో చూసినట్లయితే గౌతమ్ రాజు కు 320 ఓట్లు రాగా ఎం .వి, ఉత్తేజ్ గెలుపొందారు. జనరల్ సెక్రటరీ స్థానం కు పోటీచేసిన జీవితకు 314 ఓట్లు రాగా జీవితపై రఘు బాబు 341 ఓట్లతో విజయం సాధించారు. ఇక మొత్తానికి 18 ఈసీ స్థానాల్లో మంచు విష్ణు ప్యానల్ నుండి 10... ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది గెలుపొందారు.