MAA: ప్రకాష్‌రాజ్‌ను ఎవరూ వదులుకోరు..!
మా ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అంతకుముందు నాగబాబు కూడా ప్రకటించారు. తాజాగా శివాజీరాజా కూడా నరేష్ పై విచారణ జరిపించాలని, లేదంటే తాను కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ లాంటివారిని ఎవరూ వదులుకోరని, ఆయనకు 260 ఓట్లవరకు వచ్చాయని, అంటే ఆయన కూడా కావాలని కోరుకున్నారుకదా అని విష్ణు అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను ఆమోదించడంలేదని, వారిద్దరినీ తాను వ్యక్తిగతంగా కలుస్తానని, వారితో చర్చిస్తానని విష్ణు అన్నారు. కానీ ప్రకాష్ రాజ్‌కానీ, నాగబాబు కానీ అంగీకరిస్తారా? అనేది ఇప్పుడు సందేహమే. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో వారి మాటల తూటాలుకానీ, దుందుడుకు మాటలుకానీ ఇతరులను నొప్పించాయి. తెలుగు నటులుకానివారు మా ఎన్నికల్లో పోటీచేయకుండా బైలాస్‌లో మార్పులు చేస్తారని వస్తున్న ప్రచారం కూడా అవాస్తవమని విష్ణు స్పష్టం చేశారు.