ప్రజలను తక్కువ తినమంటున్న పాక్ మంత్రి ..షాక్ లో పాక్ ప్రజలు !!!

Surya
ఆహార సంక్షోభం అన్ని దేశాలను కుదిపేస్తూ వుంది. నిత్యావసర  ధరలు ఆకాశానికి నిచ్చెన వేసుకొని అందనంత ఎత్తులో కూర్చున్నాయి. ఈ నేపథ్యం లో పాక్ కేంద్ర మంత్రి అలీ అమీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి. నిత్యావసర ధరలు పెరిగినందుకు మంత్రిగారిని ధరలు తగ్గించమని అడిగితే మంత్రి చెప్పిన మాట విని వినియోగ దారులు ముక్కున వేలేసుకుంటున్నారు. పాక్ దేశం లో నిత్యావసరాలైన పంచదార, పప్పు , ఉప్పు , పిండి వంటి నిత్యావసరాలు ధరలు విపరీతంగా పెరిగాయి. 




పెరుగుతున్న రేట్లేమో గాని అలీ అమీన్ మాత్రం నిత్యావసరాలను తగు మొత్తం లో తినవలసిందిగా సలహా ఇచ్చారు. దానికి వివరణ కూడా ఇచ్చారు మంత్రిగారు. పెద్దలు నిత్యావసరాలను తక్కు వగా తీసుకుని పిల్లలకు మిగల్చవలసింది గా వివరణ ఇచ్చారు. దేశం లో రోజురోజుకు పెరిగి పోతున్న ద్రవ్యోల్బణం గురించికూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు . పిల్లల కోసం త్యాగాలు చేయమని సలహా ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: