ఏపీ హైకోర్టు సీజేగా ప్ర‌శాంత్ కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ జ‌స్టీస్ ప్ర‌శాంత్‌కుమార్‌తో ప్ర‌మాణం చేయించారు. విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌లు హాజ‌ర‌య్యారు.
ఏపీ హై కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్‌మిశ్రా 1964 ఆగ‌ష్టు 29న రాయ‌గ‌డ్‌లో జ‌న్మించారు. బిలాస్‌పూర్‌లో గురుఘాసిదాస్‌వ‌ర్సిటీ నుండి బీఎస్సీ, ఎల్ ఎల్ బీ ప‌ట్టా పొందారు. 1987 సెప్టెంబ‌ర్ 4న న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేయించుకున్నారు. చ‌తీష్‌ఘ‌డ్ రాష్ట్రంలోని రాయ‌గ‌డ్ జిల్లాకోర్టు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు, చ‌త్తీస్‌గ‌డ్ హైకోర్టుల‌లో ప్రాక్టిస్ చేశారు. ఛ‌త్తీస్‌గ‌డ్ బార్ కౌన్సిల్‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2009 డిసెంబ‌ర్ 10న ఛ‌త్తీస్‌గ‌డ్ హైకోర్టు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. తాత్కాలికంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా విధులు నిర్వ‌హించాడు. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియ‌మితుల‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: