శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి వాన కురుస్తోంది. అదేవిధంగా ఉదయం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా నడుస్తోంది. వానలో సైతం అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ కు చేరుకుని, తమ హీరో కు విషెస్ చెప్పి, సినిమా చూసి వెళ్లారు. మార్నింగ్ షో సరే ఇప్పుడు ఈవెనింగ్ షోస్ కు కూడా అలానే ఫ్యామిలీ ఆడియెన్స్ ఉన్నారు. సినిమాకు మంచి టాక్ ఉంది. పూజాబేబీ ఇరగదీసిందని టాక్ . అఖిల్ మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడని టాక్. ఇవి చాలు కదా! థియేటర్ దగ్గరకు రావడానికి.. షోస్ హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తున్నాయి. ప్రొడ్యూసర్ బన్నీ వాసు పండుగ చేసుకోవచ్చు. కలెక్షన్స్ పెరిగి వీకెండ్ తరువాత నిలబడే సినిమా కూడా ఇదొక్కటే. శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని థియేటర్ వర్గాలు చెబుతున్నాయి. మా ఊళ్లో ఎస్వీసీ థియేటర్ కు మంచి కలెక్షన్లు వచ్చాయి. అదేవిధంగా ఇదే సమయంలో విడుదలయిన పెళ్లి సందడికి మంచి టాక్ రాలేదు. అయినా సరే హౌస్ ఫుల్ .. మహా సముద్రం కు కూడా బాగానే జనం వెళ్తున్నారు. మూడు సినిమాల్లో అక్కినేని చిన్నోడే కొంచెం తడబడినా నిలబడ్డాడు. పూజా బేబీ గ్లామర్ ఎడిషనల్ అట్రాక్షన్ అని కూడా అంటున్నారు. లెహరాయి పాటతో మంచి ఔట్ పుట్ ఇచ్చాడు గోపీ సుందర్ అనే మ్యూజిక్ డైరెక్టర్. బొమ్మరిల్లు భాస్కర్ అక్కడక్కడా విసిగించినా సినిమాకు పాజిటివ్ వైజ్ మాత్రం బాగానే ఉంది. అఖిల్ గత సినిమాల కన్నా ఓపెనింగ్స్ బాగున్నాయి. దసరా సీజన్ లో హీరో ఎవరు అంటే??? ఇంకొద్ది రోజులయ్యాక అఖిల్ అనే అయ్యగారే!