కళా 'మా' తల్లి: రోజుకో 'మా'ట.. పూటకో 'మా'ట..!!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు అధికారిగా వ్యవహరించిన కృష్ణమోహన్ పనితీరుపై, ప్రస్తుతం ఆయన మాట తీరుపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ బహిరంగంగానే ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు సీసీటీవీ పుటేజ్ కావాలని అడిగారు. దానికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే.. మా కార్యాలయానికి ఫోన్ చేసి అడిగాను.. ఇంకా పుటేజ్ ఇవ్వలేదు.. రాగానే కబురు చేస్తానన్నారు.. వారు నాకు కబురు చేయగానే మీకు పుటేజ్ ఇస్తాను అంటూ ప్రకాష్ రాజ్‌కు ఆయన సమాధానమిచ్చారు. ఆ తర్వాత సీసీటీవీ పుటే్జ్ పరిశీలించాం.. ఎటువంటి అవక తవకలు జరగలేదు.. అంతా సవ్యంగా సాగింది.. మీరు ఆరోపిస్తున్నట్లుగా ట్యాంపరింగ్ కూడా జరగలేదు.. అయినా మీరు విష్ణు గెలుపును ఆహ్వానించరుకదా..అన్నారు. అయినా కాపీ అందజేస్తామన్నారు. తాజాగా ఈరోజు ఎన్నికలకు ముందుకానీ, కౌంటింగ్ సమయంలోకానీ అడిగివుంటే కచ్చితంగా అందించేవాణ్ని.. కానీ ఇప్పుడు మా అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికయ్యారు కాబట్టి.. ఆ వ్యవహారం ఆయన పరిధిలోనే ఉంటుంది అన్నారు. తనకేం సంబంధం లేదని తేల్చేశారు. ఇదీ మా ఎన్నికలను పర్యవేక్షించిన అధికారి మార్చుతున్న మాట తీరు..??