కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిని సాధించిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో కూడా ఆర్థికంగా 11.5 శాతం వృద్ధిని సాధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మోయడానికి హమాలీలు.. ఆడించడానికి రైస్ మిల్లు సరిపోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. తమను తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు .
తెలంగాణ దేశానికి తలమానికంగా ఉందని... దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలన్నీ కాపీ కొడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ కడతామంటే కేసులు పెట్టారని... యాదాద్రి గుడి కడతామని చెప్తే కేసులు పెట్టారని ఆయనా కూడా అన్నింటినీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. లేనిపోని రచ్చ చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాగు నీటి విప్లవం ప్రతి పల్లెకు తెలుసునని కేసీఆర్ చెప్పారు .