తడి బట్టలతో గుడికి రా బండి సంజయ్...!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెరాస పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు. హుజూరాబాద్ ప్రచారంలో ప్రతీ అంశాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్దామా సంజయ్ అంటూ ఆయన సవాల్ చేసారు. 20 వేల రూపాయలు పంచినట్టు నిరూపిస్తారా అని ఆయన నిలదీశారు.
 
తడి బట్టలతో అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా అని సవాల్ చేసారు. ఎవరు తప్పు చేస్తే.. వాళ్ళకే శిక్ష పడుతుంది అన్నారు. చికెన్లు, గుడ్లు పంపింది మీరు కదా అని నిలదీశారు. వరి కొంటె ఉరే అంటున్న సంజయ్.. కేంద్రాన్ని నిలదీయాలి అని హితవు పలికారు. రైతులను, దేవుళ్లను కూడా మభ్య పెడుతున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: