మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ ...పూర్తిగా కోలుకున్న తేజ్..!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల యాక్సిడెంట్ తో ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. తేజ్ కాల‌ర్ బోన్ కు ఫ్యాక్చ‌ర్ అవ్వ‌డంతో స‌ర్జరీ చేసి అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచారు. అయితే తేజ్ ఆస్ప‌త్రిలో చేరిన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ రాక‌పోవ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అంతే కాకుండా తేజ్ ఆరోగ్యంపై పుకార్లు కూడా పుట్టుకువ‌స్తున్నాయి. 


కాగా తాజాగా మెగా ఫ్యామిలీ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నార‌ని మెగా ఫ్యామిలీ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం తేజ్ స్పీచ్ థెర‌పీ మ‌రియు ఫిజియో థెర‌పీ ట్రీట్ మెంట్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక పూర్తిగా కోలుకున్న తేజ్ త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్ ల‌కు కూడా హాజ‌ర‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: