బ్రేకింగ్: రవీందర్ రెడ్డి మృతి...!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేసారు రవీందర్ రెడ్డి. రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసారు. స్థలం కొనుగోలు లో మధ్యవర్తిత్వం వహించారు మోహన్ రెడ్డి. తనకు రావాల్సిన కమిషన్ డబ్బులు ఆరు లక్షలు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తన కమిషన్ ఇవ్వకుండా రెండు నెలల క్రితం రవీందర్ రెడ్డి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఆగ్రహం తో ఊగిపోయాడు. దీంతో హతమార్చలని భావించి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది.