టీఆర్ఎస్ నేతలకు ప్లెక్సీల సెగ
తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీ ప్లెక్సీల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ భారీగా జరిమానాలు విధించింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలకు ఫైన్ లు విధిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ప్రకటన విడుదల చేసింది. అత్యధికంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మొత్తం 2 లక్షల 35 వేల జరిమానా, మంత్రి తలసానికి 80 వేల జరిమానా వరకు జీహెచ్ఎంసీ విధించింది. సర్వర్ అప్ గ్రేడేషన్ తో నేటి నుంచి మళ్లీ చలానాలు వేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రకటించారు. ఏ పార్టీ నాయకులు అయినా జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.