గుండె పోటుతో ఆస్ప‌త్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్..డాక్ట‌ర్లు ఎమన్నారంటే..!

క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ తీవ్ర‌మైన ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో చేరారు. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల 30 నిమిషాల‌కు పునీత్ రాజ్ కుమార్ కు గుండెనొప్పి రావ‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు. బెంగులూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్ లో రాజ్ కుమార్ చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆస్ప‌త్రి యాజ‌మాన్యం పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉందంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆయ‌నకు సీరియ‌స్ గా ఉంద‌ని..ఇప్పుడే ఏం చెప్ప‌లేమంటూ చేతులు ఎత్తేస్తుంది. 

సీరియ‌స్ కండీష‌న్ లో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా పునీత్ రాజ్ కుమార్ క‌న్న‌డ‌లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అంతే కాకుండా ఆయ‌న‌కు క‌న్న‌డ‌తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. పునీత్ ను క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ అని పిలుస్తుంటారు. అంతే కాకుండా ఇటీవ‌లే పునీత్ రాజ్ కుమార్ త‌న సినిమాను తెలుగునూ రిలీజ్ చేసి టాలీవుడ్ కు ద‌గ్గ‌ర‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: