బ్రేకింగ్: స్టార్ హీరో గుండెపోటు ఆస్పత్రికి సినీ పెద్దలు...!

ప్రముఖ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కాసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఆయనకు డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందించగా అప్పటికే ఆయన ఆరోగ్యం విషమంగా మారింది అని వైద్యులు తెలిపారు.

ఆయనని కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ముందు అత్యంత విషమంగా ఉందని చెప్పిన డాక్టర్లు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆయన ప్రాణాలు కోల్పోయారు చెప్పినట్లు తెలుస్తోంది. 29 సినిమాల్లో హీరోగా నటించిన పునీత్ రాజ్ కుమార్  కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు. ఆయన మరణంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన గుండెపోటుకు గురయ్యారు అనే వార్త తెలియగానే ముఖ్యమంత్రి అలాగే పలువురు మంత్రులు ఆయన సోదరులు ఆస్పత్రికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: