బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య, కాసేపట్లో జూనియర్ కూడా...!
ఇవాళ సాయంత్రం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగుతున్న నేపధ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసింది కన్నడ ప్రభుత్వం. సిఎం బసవరాజ్ బొమ్మై, సహా హోం మంత్రి తో పాటుగా డీజీపీ అందరూ పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయం వద్దనే ఉండటం గమనార్హం. ఇక మన తెలుగు నుంచి పలువురు ప్రముఖులు అక్కడికి వెళ్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు బెంగళూరుకు కుమార్తె విందిత రాజ్ కుమార్ చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
అయితే శనివారం కావడంతో రేపు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటె కాసేపటి క్రితం ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పునీత్ తో తనకు ఉన్న అనుబంధాన్ని నేమరవేసుకున్నారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది.