టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ పేకాట ఆడుతూ పలువురు పట్టుబడ్డారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే పేరుతో నాగశౌర్య విల్లాను అద్దెకు తీసుకుని అందులో పేకాటను ప్రారంభించాడు. పక్కా సమాచారంతో పోలీసులు నింధితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్ తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్ కు నాగ శౌర్య మద్య సంబంధాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
అయితే ఈ కేసులో తెరపైకి నాగ శౌర్య బాబాయ్ బుజ్జి పేరు వచ్చింది. దాంతో నాగ శౌర్య బాబాయ్ బుజ్జి పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసులో నాగశౌర్య బాయి పేరు వెలుగుతోకి రావడంతో లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుమన్ కుమార్ ఫోన్ ను పోలీసులు ఇప్పటికే సీజ్ చేసారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖులను సైతం ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరికాసేపట్లో నిందితులను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.