నేడే హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కొనసాగుతుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ 86.64 శాతం జరిగిన విషయం తెలిసిందే. 753 మందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కింపు కొనసాగుతుంది. రెండు హాళ్లు, 14 టేబుళ్లు, 22 రౌండ్లలో 8.30 గంటల తరువాత లెక్కింపు కొనసాగుతుంది. తొలి ఈవీఎం లెక్కింపు హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో కొనసాగుతుంది. ఆ తరువాత చివరి ఈవీఎం కమలాపూర్ మండలం శంబునిపల్లి గ్రామానికి చెందిన ఈవీఎం ఓట్ల లెక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ ఫలితం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.