కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు స్పీడ్ గా జరుగుతోంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ మైన దగ్గర నుంచి కూడా అధికార వైసీపీ దూసుకు పోతోంది. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీ సాధిస్తూ దూసుకు పోతున్నారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇప్పటికే వైసీపీకి ఏకంగా 30 , 412 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఎంతో ప్రబావం చూపుతుంది అనుకున్న బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోతోంది. తొలి నాలుగు రౌండ్లలో కలశపాడు మండల ఓట్లను లెక్కించారు. ఆది నారాయణ రెడ్డి బీజేపీ కి ఇక్కడ 20 వేల పై చిలుకు ఓట్లు వస్తాయని ముందు నుంచి ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు అవి నెరవేరేలా కనపడడం లేదు.