కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ (మం) లైన్ గూడలో పసికందును నేలకేసి కొట్టి తండ్రి దారుణంగా హతమార్చాడు. ఆడబిడ్డ పుట్టిందనే కారణంతోనే తండ్రి బాపురావు పసిబిడ్డు హత్య చేశాడు. దాంతో ఆ కిరాతక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలో వేశారు. ఈ ఘటనకు సంభందించి కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ మీడియాతో మాట్లాడారు. మూడోసారి ఆడపిల్ల పుట్టిందన్న కోపంతోనే బాపురావు ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ డీఎస్పీ వెల్లడించారు.
సీసీ రోడ్డుపై పాపను కొట్టడంతో పాటు బండ రాయితో మోదడం తో చనిపోయిందని ఆయన వెల్లడించారు. ఇక ఈ ఘటన స్థానింకంగా కలకలం రేపగా కిరాతక తండ్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో పసిబిడ్డను చంపిన కిరాకతుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మానవ మృగాల్లలో మాత్రం మార్పు రావడంలేదు.